కరోనాతో రాష్ట్రానికి ఆదాయం బాగా తగ్గిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అమరావతి: కరోనాతో రాష్ట్రానికి ఆదాయం బాగా తగ్గిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం నాడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద లబ్దిదారులకు నిధులను బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. మహిళా సాధికారిత మా నినాదం కాదు మా విధానమన్నారు. బ్యాంకులతో మాట్లాడి స్వయం సహాయక గ్రూపు సభ్యుల మహిళలపై భారం తగ్గించామని ఆయన చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు నైపుణ్యతను పెంచే కార్యక్రమాలను చేపట్టామన్నారు. మహిళల ఆదాయం పెరిగేలా చేయూతనిచ్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటివరకు సున్నా వడ్డీ కింద రూ. 2,509 కోట్లు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు తమ ప్రభుత్వం అండగా నిలబడ్డామని చెప్పారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. మహిళల ఆర్ధిక స్వావలంభన కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అక్కా చెల్లెళ్లమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని జగన్ విమర్శించారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మహిళలకు 50 శాతం నామినేటేడ్ పోస్టు
