వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి తలశిల స్వర్ణకుమారి అనారోగ్యంతో కన్నుమూశారు. స్వర్ణకుమారి మృతిపై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి తలశిల స్వర్ణకుమారి అనారోగ్యంతో కన్నుమూశారు. స్వర్ణకుమారి మృతిపై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తలశిల రఘరామ్ కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు. విజయవాడ గొల్లపూడిలోని రఘురామ్‌ నివాసానికి చేరుకున్న సీఎం జగన్, ఆయన సతీమణి భారతి.. స్వర్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పించారు. రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పలువురు వైసీపీ నాయకులు కూడా తలశిల రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించారు.


‘‘నా ఆత్మీయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, త‌ల‌శిల ర‌ఘురాం స‌తీమ‌ణి త‌ల‌శిల స్వ‌ర్ణ కుమారి అకాల మరణం బాధాక‌రం. ర‌ఘురాంకు, తన కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని సీఎం జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Scroll to load tweet…


ఇక, తలశిల రఘురామ్‌ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ఏర్పాట్లను తలశిల రఘురామ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సీఎం జగన్ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక, ఆయనను సీఎం జగన్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా రఘురామ్‌కు అవకాశం కల్పించారు.