Asianet News TeluguAsianet News Telugu

‘ నివర్‌ ’తో వణికిన ఏపీ: రేపు జగన్ ఏరియల్ సర్వే

నివర్ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సీఎం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు.

ys jagan conduct aerial survey in nivar cyclone affected areas tomorrow ksp
Author
Amaravathi, First Published Nov 27, 2020, 8:26 PM IST

నివర్ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సీఎం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు.

తుపాను ప్రభావంపై జగన్‌ నిన్న తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, భారీ వర్షాలు తదితర అంశాలపై సీఎంఓ అధికారులు.. ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.

Also Read:తీరందాటిన నివర్... తమిళ రాజధాని చెన్నై అతలాకుతలం

వర్షాల అనంతరం పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలు కారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు.

కాగా నివర్‌ తుపానుపై శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios