వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 45వ పుట్టినరోజును పాదయాత్రలోనే జరుపుకున్నారు. గురువారం జగన్ పుట్టినరోజన్న విషయం తెలిసిందే. ప్రజా సకల్పయాత్ర బిజిలో ఉన్న జగన్ ప్రస్తతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నారు. 41వ రోజు పాదయాత్రలో భాగంగా పుట్టపర్తిలో నియోజకవర్గంలోని నల్లమాడ మండలంలో పర్యటిస్తున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని వైసిపిలోని ప్రముఖులు పలువురు జగన్ వ్యక్తిగతంగా కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు అభిమానులు కేక్ కటింగ్ కూడా చేయించారు. మొత్తం మీద జగన్ తన పుట్టినరోజును నిరాడంబరంగానే అభిమానుల మధ్య జరుపుకున్నారు.