చంద్రబాబును ఓడించండి..జగన్ పిలుపు

చంద్రబాబును ఓడించండి..జగన్ పిలుపు

చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంచతన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని జగన్ జనాలకు పిలిపిచ్చారు. పాదయాత్రలో భాగంగా గురువారం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ, ‘వచ్చే ఎన్నికల్లో మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుండే మొదలుకావాల’న్నారు.

జగన్ పాదయాత్రలో జనాలు అనూహ్యంగా స్పందించారు.  కుప్పం నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాల నుండి భారీగా తరలి వచ్చిన అభిమానులు జగన్ కు సంఘీభావం తెలిపారు. జగన్ మాట్లాడుతూ బి.సి.లను సులువుగా మోసగించవచ్చని కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు చంద్రబాబుపై  మండిపడ్డారు. తమకు ఏమి చేసారో చెప్పాలంటూ చంద్రబాబు ను నిలదీయండని బిసిలకు పిలుపిచ్చారు. కుప్పం లో చంద్రబాబు ను ఓడిస్తేనే బి.సి.లకు మేలు జరుగుతుందన్నారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాలు వలన పేదలు, బి.సి.లు బాగుపడతారని చెప్పారు. వైసిపి గెలుపు కుప్పం నియోజకవర్గం నుండే మొదలుకావాలన్నారు. వైసిపి అభ్యర్ధి చంద్రమౌళి ని గెలిపిస్తే కేబినెట్ లో కూర్చోబెట్టి కుప్పం ను చంద్రబాబు హయాంలో కన్నా మెరుగ్గా అభివృద్ధి చెస్తానని జగన్ హామీ ఇచ్చారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos