అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవుల పంపకంపై దృష్టి పెట్టారు. పార్టీ పెట్టిన నాటి నుంచి అనేక కష్టనష్టాల్లో తన వెంట నడిచిన వారి రుణాన్ని తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు.

దీనిలో భాగంగా ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల్లో 100 మందికి మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టనున్నారు. ప్రస్తుతానికి 25 మందితో ఆయన కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించి మరో 25 మందికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులతో పాటు పలు కార్పోరేషన్లకు ఛైర్మన్ పదవులను కట్టబెట్టే అవకాశాలున్నాయి.