రూ.145 కోట్లు తెలంగాణకు ఇచ్చి ఉంటే..: చంద్రబాబుపై జగన్ నిప్పులు

YS Jagan blames Chnadrababu on Kolleru issue
Highlights

తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.145 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగైదు టిఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని, దానివల్ల కైకలూరు ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు.

కైకలూరు: తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.145 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగైదు టిఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని, దానివల్ల కైకలూరు ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కైకలూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 

తాము అధికారంలోకి రాగానే కొల్లేరను రీసర్వే చేయిస్తామని, కొల్లేరు వాసులనే ఎమ్మెల్సీని చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మంచినీళ్లు లేవు ఉప్పు నీళ్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని. నాలుగేళ్ల పాటు మోడీ మంత్రివర్గంలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారని ఆయన చెబుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు కైకలూరు, కొల్లేరు గుర్తుకు రాలేదా అని అడిగారు. 

కొల్లేరు సమస్య పరిష్కారానికి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుందని, సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు మోసాలకు కైకలూరు ఓ ఉదాహరణ అని ఆయన విమర్శించారు. 

రైతులను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కాల్వలను ఆధునీకరించలేదని అన్నారు. ఆక్వా రంగంలో దళారీ వ్యవస్థ పెట్రేగిపోతోందని, కైకలూరులోని ప్రభుత్వ ల్యాబ్ ను మూసేశారని, దళారీలకు నాయకుడు చంద్రబాబేనని ాయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పారు.  పంటలకే కాదు చేపల చెరువులకు కూడా నీళ్లిస్తామని చెప్పారు

కైకలూరు నియోజకవ్రగంలో 109 గ్రామాలుంటే 94 గ్రామాల్లో నీటికి కటకట ఉందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.  

loader