వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్.. టెక్కలి నియోజకవర్గంలో పార్టీనేతలు,కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు.

పుట్టినరోజు సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. మరోవైపు అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిందేకు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు.