వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీమహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం సోమవారంతో పరిసమాప్తమైంది.  గుంటూరు జిల్లా తాడేపల్లిలో దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న ఈ యాగం పూర్ణాహుతితో సంపూర్ణమైంది.

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.