ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు‌కు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు‌కు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది

కేసు విచారణలో భాగంగా ఇవాళ ఎన్ఐఏ అధికారులు శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అతనికి ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ఈ కేసులో తొలి నుంచి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోన్న మీడియాకు కోర్టు చురకలు అంటించింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఛార్జ్‌షీటు పత్రాన్ని మీడియాలో చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.