మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించడం వైఎస్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. బాబాయ్ మరణవార్త తెలుసుకున్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వివేకా కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్, విజయమ్మ హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరినట్లుగా సమాచారం. ఈ తెల్లవారు జామున పులివెందులలోని స్వగృహంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.