తన ప్రేమను ఇంట్లో వాళ్లు కాదంటున్నారని సొంత వారిపైనే కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నవారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో సొంత ఇంటికే నిప్పు పెట్టాడు. కాగా.. కుటుంబసభ్యులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... తన ప్రేమ వ్యవహరంలో కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించిన వంశీకృష్ణ అనే యువకుడు పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్‌తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.