కడప జిల్లాలో స్టీల్  ప్టాంట్ ఏర్పాటు జాప్యం అవుతున్నందుకు యువకుల  ఆగ్రహం

కడప ఉక్కు కోసం కలెక్టొరేట్ ముట్టడి

 

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ గత 95 రోజులుగా దీక్ష లూ చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పదించ క పోవడం పట్ల కడప పట్టణంలో జిల్లా యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉక్కు దీక్ష లకు మద్దతుగా వారు నేడు  చలో కలెక్టరేట్, కలెక్టొరేట్  ముట్టడి  కార్యక్రమం చేపట్టారు. అయితే, పోలీసులు ఈ కార్యక్రమం కొనసాగకుండా ఆందోళన కారులను అరెస్టు చేశారు.  అరెస్టయిన వారిలో  రాయలసీమ కమ్యుూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  ఎన్. రవి శంకర్ రెడ్డి విద్యార్ధి యువకులు ఉన్నారు.