లిఫ్ట్ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్ రాకముందే వచ్చిందనుకొని అందులోకి వెళ్లి... ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన విజయవాడ గవర్నర్ పేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గవర్నర్ పేటకు చెందిన షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు కుటుంబంతో కలిసి స్థానిక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కాగా... మంగళవారం ఉదయం కిందకు వెళ్లేందుకు ఇర్ఫాన్ లిఫ్ట్ బటన్ నొక్కాడు. వెంటనే లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. డోర్లు అయితే తెరుచుకున్నాయి కానీ.. లిఫ్ట్ పైకి రాకపోవడం గమనార్హం. అది గమనించుకోకుండా ఇర్ఫాన్.. లిఫ్ట్ లోకి వెళ్లాడు.

AlsoRead భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి....సోషల్ మీడియాలో పెడతానంటూ.....

దీంతో... లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్థు నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఇర్ఫాన్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గవర్నర్ పేట పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

కాగా... ఇలా లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకోవడంలో కొంత కాలం క్రితం హైదరాబాద్ లో కూడా ఓ మహిళ చనిపోయింది. ఇక లిఫ్ట్ లో ఇరుక్కొని చనిపోయేవారి సంఖ్య చాలానే ఉంది.  సాంకేతిక సమస్యల కారణంగానే  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.