రాత్రిపూట శ్రీలక్ష్మీ మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నాడు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య.. సిగరెట్లు, వాటర్ బాటిల్ తీసుకొని రూ.50 బిల్లును ఫోన్ పే చేశాడు.
కేవలం రూ.50 కోసం మొదలైన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. మరో ముగ్గురు జీవితాలను రోడ్డునపడేసింది. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన షేక్ బాజి(27) ఆటోనగర్ ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్ మన్ గా పనిచేస్తున్నారు. రాత్రిపూట శ్రీలక్ష్మీ మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నాడు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య.. సిగరెట్లు, వాటర్ బాటిల్ తీసుకొని రూ.50 బిల్లును ఫోన్ పే చేశాడు.
అయితే.. ఆ డబ్బులు యజమాని ఖాతాలోకి చేరలేదు. ఇదే విషాయన్ని యువకుడికి చెప్పగా.. మనీ రాకపోతే.. తర్వాత ఇస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. అయితే.. నాలుగు రోజులు గడుస్తున్నా.. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో.. బాజీ వెళ్లి.. సదరు యువకుడిని, అతని సోదరుడిని మళ్లీ అడిగాడు.
అయితే.. రూ.50 కోసం వెళ్లి తనని కాదని తన సోదరుడిని అడుగుతారా అంటూ కోటివీరయ్య కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో దుకాణ యజమాని వాసు, అందులో పనిచేసే బాజి లపై మండిపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బాజికి తీవ్రగాయాలై స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కాగా.. రూ.50కోసం తలెత్తిన వివాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అతని భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డు పడాల్సి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 22, 2021, 8:42 AM IST