నగ్నంగా ఫోటోలు దిగి తనకు పంపాలని ఓ యువకుడు బాలికను బెదిరించాడు. చివరకు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  విశాఖ నగరం 66వ వార్డుకి చెందిన ఓ బాలికకు మిస్డ్ కాల్ ద్వారా నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు పరిచయం అయ్యాడు.

మూడు నెలలుగా వారు ఒకరితో మరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల శ్రీనివాసరావు బాలికను తన అర్థనగ్న ఫోటోలు పంపించాలని కోరాడు. అందుకు బాలిక అంగీకరించలేదు. దీంతో ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన బాలిక అతను అడిగినట్లుగానే అర్థనగ్న ఫోటోలను వాట్సాప్ లో పంపిచింది.

ఈసారి నగ్నం గా ఫోటోలు పంపించమని కోరాడు. దానికి బాలిక అంగీకరించలేదు. దీంతో... ఆమె గతంలో పంపిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడాతానని బెదిరించడం మొదలుపెట్టాడు.శ్రీనివాసరావు వేధింపులు తట్టుకోలేక జరిగిన విషయాన్ని బాలిక తన కుటుంబీకులకు తెలియజేసింది. వారు గోపాలపట్నం పోలీసుల్ని ఆశ్రయించగా సీఐ రమణయ్య ఆధ్వర్యంలో కేసు నమోదుచేసి ఎస్‌ఐ రఘురామ్‌ కేసు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా శ్రీనివాసరావు అడ్రస్‌ను తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.