వివాహితతో అక్రమసంబంధం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యువకుడి ప్రాణాలే పోయాయి (వీడియో)
వివాహితతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.
గుంటూరు : అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. కేవలం క్షణకాలం సుఖంకోసం కొందరు నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలకేంద్రంలో పరమేశ్వరసాయి(23) భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఈమెకు అయ్యన్నకుంటపట్టికి చెందిన బైక్ మెకానిక్ సందీప్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. పరమేశ్వరసాయి ఇంట్లోలేని సమయంలో భార్య ప్రియుడు సందీప్ ను పిలుచుకునేదట. ఇలా భార్య మరో యువకుడితో సాగిస్తున్న అక్రమ సంబంధం గురించి పరమేశ్వరసాయికి తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.
వీడియో
అయితే భర్త హెచ్చరించినా ఆమె సందీప్ తో సంబంధాన్ని తెంచుకోలేదు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి భర్త ఇంట్లోలేని సమయంలో ఆమె సందీప్ ను పిలిపించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా వుండగా ఇంటికి వచ్చిన పరమేశ్వరసాయి గమనించాడు. వెంటనే బయటకు వచ్చిన అతడు తలుపులు మూసి తాళం వేసాడు. ఇరుగుపొరుగువారిని పోగుచేసి విషయం తెలిపాడు.
Read More దారుణం.. వివాహితను 20 రోజులు గదిలో బంధించి వాలంటీర్ అత్యాచారం..
వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వట్టిచెరుకూరు ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా గల నివాసంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు... హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో సందీప్ ది ఆత్మహత్యా లేక హత్యా తేలనుంది.