తల్లిదండ్రులపై కోపంతో యువతి ఆత్మహత్య

First Published 14, Jul 2018, 1:39 PM IST
young girl suicide in vijayawada
Highlights

తల్లిదండ్రుల పై కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులను డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో యువతి ఈ దారుణానికి పాల్పడింది. క్షణికావేశంలో యువతి తీసుకున్న ఈ నిర్ణయం ఆమె ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా  ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ కాలనీకి చెందిన సింగంపల్లి నిహారిక బెంగళూరులో మల్టీ మీడియా కోర్సుచేసి ఇటీవలే విజయవాడకు వచ్చింది. కొద్దిరోజులుగా తల్లిదండ్రులతో కలిసి నగరంలోనే ఖాళీ గా ఉంటోంది. యువతి తల్లి నగరంలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తుండగా, తండ్రి గన్నవరం లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే ఇంట్లొ ఖాళీగా ఉండటం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అవసరమైన డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగింది. అయితే కూతురుని ఒంటరిగా హైదరాబాద్ పంపించడం ఇష్టం లేని  తల్లిదండ్రలు నిహారికను పంపించాడని ఒప్పుకోకుండా డబ్బులను ఇవ్వలేదు. దీంతో యువతి తీవ్ర మనస్థాపానికి లోనయ్యింది.

దీంతో తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.  దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

loader