విశాఖపట్నం: బాలికను కిడ్నాప్ చేసి బంధించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఎలాగోలా దుర్మార్గుడి నుండి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి బయటపడింది.

వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లాలోని కుంబిడిసింగి గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే వారంరోజుల క్రితం బాలిక ఒంటరిగా వుండగా గుర్తించిన యువకుడు బెదిరించి బైక్ పై ఎక్కించుకుని అరకుకుతీసుకెళ్లాడు. అక్కడ ఓ లాడ్జీలో బాలికను బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అనంతరం బాలికకు మాయమాటలు చెప్పి తాళి కట్టాడు. అయితే అత్యాచారం జరిగినట్లుగానీ, పెళ్లి చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు, పోలీసులకు చెప్పొద్దని బెదిరించాడు. అయినప్పటికి బాలిక అతడిని నమ్మని యువతి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలపడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.