విశాఖపట్నం: మితిమీరిన వేగంతో ఇతర వాహనదారులను ఇబ్బందిపెడుతూ వెళ్లడమే కాదు ఇదేంటని అడిగిన ఓ ఎస్సైతోనే దురుసుగా ప్రవర్తించారు ఇద్దరు యువకులు. ఇలా పోలీసుతోనే వాగ్వాదానికి దిగి చివరకు పోలీస్ స్టేషల్ మెట్లెక్కాల్సి వచ్చింది. 

విశాఖలోని పీఎం పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మితిమీరిన వేగంతో వెళుతూ ఎస్సై నిహార్ కారును ప్రమాదకర రీతిలో ఓవర్  టేక్ చేశారు. దీంతో ఎస్సై వారిని మందలించే ప్రయత్నం చేయారు. అయితే ఎస్సై మాటలు వినిపించుకోకుండా యువకులిద్దరూ ఎస్పైతో దురుసుగా ప్రవర్తించారు. 

దీంతో ఎస్సై నిహాల్ తన సిబ్బంది సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులిద్దరూ గోపాలపట్నంకు చెందిన వారిగా గుర్తించారు.