Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ న్యూస్ : రేపే అవిశ్వాస తీర్మానానికి నోటీసు

  • మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో రేపే అవిశ్వాసానికి నోటీసు ఇవ్వాలని వైసిపి నిర్ణయించటం సంచలనంగా మారింది.
Ycp to move no motion confidence on Friday it self

ప్రత్యేకహోదా కేంద్రంగా ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శుక్రవారం రోజే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టటానికి వైసిపి రెడీ అవుతోంది. మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో రేపే అవిశ్వాసానికి నోటీసు ఇవ్వాలని వైసిపి నిర్ణయించటం సంచలనంగా మారింది.

ఎందుకంటే, అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వటానికి ముందు అనుకున్న తేదీ ఈనెల 21. అయితే, బడ్జెట్ సమావేశాలను షెడ్యూల్ కన్నా ముందుగానే ముగించేయాలని కేంద్రప్రభుత్వం అనుకుంటోంది. దాంతో అవిశ్వాస తీర్మానం పెట్టటానికి అవకాశం ఉండదేమో అన్న ఉద్దేశ్యంతో వైసిపి కూడా తేదీని ముందుకు మార్చుకున్నది. వైసిపి ఇవ్వనున్న నోటీసుకు మద్దతు ఇవ్వటానికి సరిపడా బలం ఉన్నట్లు సమాచారం.

ఎప్పుడైతే తేదీని ముందుకు మార్చుకున్నదో వెంటనే వైసిపి నేతలందరూ రంగంలోకి దిగారు. జాతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. తాము ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేఖలు అడుగుతున్నారు. ఇప్పటికే జగన్ అన్నీ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఎలాగైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకుండా చేయాలని కేంద్రం పావులు కదుపుతోంది. దానికి విరుగుడుగానా అన్నట్లు శుక్రవారమే అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వటానికి వైసిపి రెడీ అయిపోతోంది. మరి, ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios