చంద్రబాబును బోనులో నిలబెడతాం: సంచలనం

చంద్రబాబును బోనులో నిలబెడతాం: సంచలనం

చంద్రబాబునాయుడును బోనులో నిలబెట్టేందుకు అవసరమైన ప్రతీ చర్యను తీసుకుంటామని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో పెరిగిపోయిన అవినీతిపై జాతాయ స్ధాయిలో చర్చించుకుంటున్నట్లు చెప్పారు. అదే విషయాన్ని తాను పదే పదే ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర విభజన అయ్యే నాటికి రాష్ట్రం అప్పు రూ. 90 వేల కోట్లుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి అదనంగా రూ. 1.2 లక్షల కోట్లు అప్పు చేసినట్లు ధ్వజమెత్తారు. తెచ్చిన లక్షల కోట్ల అప్పంతా చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తన అవినీతిపై జనాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.

తనపై చంద్రబాబు, టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టేశారు. రాజ్యసభ సభ్యుని హోదాలో తాను ప్రధానమంత్రితో పాటు కేంద్రమంత్రులను కూడా కలుస్తానని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉపయోగించుకోవటంలో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమైపోయిందంటూ మండిపడ్డారు.

ప్రత్యకహోదా కోసం చిత్తుశుద్దితో పోరాటం చేస్తోంది ఒక్క వైసిపి మాత్రమే అన్నారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నైతిక హక్కు టిడిపి లేదని మండిపడ్డారు. మొన్నటి వరకూ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి ఇపుడు ఏ విధంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ధ్వజమెత్తారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos