విజయసాయి రెడ్డి అరెస్టు

First Published 23, May 2018, 12:38 PM IST
ycp senior leader vijaya sai reddy arrest
Highlights

 పలువురు వైసీపీ నేతలను కూడా అరెస్టు చేసిన పోలీసులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్మపోరాట దీక్ష నిర్వహించిన సబా ప్రాంగణాన్ని శుద్ది చేయాలని ప్రయత్నించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో సహా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రత్యేక హోదాపై పలుమార్లు యుటర్న్ తీసుకుని ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు విశాఖను అపవిత్రం చేశారని ఈ సందర్భంగా విజయసాయి ఆరోపించారు. లక్షల కోట్లను దోచుకున్న తెలుగు దొంగల పార్టీ ప్రజలను మోసం చేయడానికి దర్మ పోరాటం అని అంటున్నారని, ఇది అదర్మాన్ని కొనసాగించడానికి జరుగుతున్న దుష్ప్యత్నం అని ఆయన అన్నారు.కేవలం కులాభిమానంతోనే ఎయు ఇంజీనిరింగ్ కాలేజీలో అనుమతించారని, తద్వారా దానిని అపవిత్రం చేశారని ,అందుకే శుద్ది కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు.
 

కాగా వైసీపీ అదినేత జగన్ పాదయాత్ర చేసినప్పుడు టిడిపి నేతలు పసుపు నీళ్లు చల్లారని, అప్పుడు అడ్డుకోని పోలీసులు ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

loader