తూర్పుగోదారి జిల్లా మండపేటలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలా కృష్ణ తన పదవికీ, పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా వైసీపీలో చోటుచేసుకున్న వర్గ రాజకీయాల నేపథ్యంలో గతంలో పనిచేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్‌, వేగుళ్ల పట్టాభిరామయ్యను పక్కన పెట్టి లీలాకృష్ణకు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ బాధ్యతను పార్టీ అప్పగించారు. 


జగన్‌ పాదయాత్ర సమయంలో లీలాకృష్ణ సారథ్యంలో కార్యక్రమాలు జరిగాయి. పాదయాత్ర తర్వాత సీటుకోసం లీలాకృష్ణ, పట్టాభి పోటీపడ్డారు. సీటు ఎవరిది అనే విషయంలో క్లారిటీ రాకపోవడంతో విసుగుచెందిన లీలా కృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తన మద్దతుదారులతో సంప్రదించి టీడీపీ లేదా వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.