Asianet News TeluguAsianet News Telugu

‘కశ్మీర్ ఫైల్స్ లా.. కాకాని ఫైల్స్ సినిమా తీయొచ్చు’… వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు...

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నెల్లూరు కోర్టులో కాకాని ఫైల్స్ చోరీ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కశ్మీరీ ఫైల్స్ లాంటి సినిమా కాకానీ ఫైల్స్ అని తీయచ్చని వ్యాఖ్యానించారు.

YCP Rebel MP Raghuram Krishnaraja comments on Nellore court theft case
Author
Hyderabad, First Published Apr 19, 2022, 8:29 AM IST

ఢిల్లీ : కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా మన రాష్ట్రంలో కాకాని ఫైల్స్ సినిమా తీయవచ్చని వైసీపీ ఎంపీ Raghuramakrishnaraju పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. Scrap దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను చూసి కుక్కలు మొరిగితే వారు భయపడి courtపై అంతస్తుకువెళ్లి తలుపులు పగలగొట్టాలని nellore జిల్లా ఎస్పీ చెప్పిన కథ నిజమై ఉండొచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దొంగతనానికి వచ్చిన దొంగలు కాకాణి ఫైల్స్ ఎత్తుకుుపోవడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.  భగవంతుని బలం, కొందరి స్క్రీన్ ప్లేతో అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అన్నారు. అంబటి రాంబాబుకు గతంలో మంత్రి పదవి లేకపోయినా ‘నోటి’ పారుదల శాఖ ఉండేదని.. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ముఖ్యమంత్రి, అంబటి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేస్తున్న అప్పుల లో నీటి పారుదల శాఖ కు ఎంత కేటాయిస్తారు చెప్పాలన్నారు.

ఇదిలా ఉండగా, నెల్లూరులోని కోర్టులో గత గురువారం నాడు రాత్రి చోరీ జరిగింది. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై  కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు   ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ అని తేలిందని ఫోరెన్సిక్ లాబొరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు.  అయితే కోర్టులో భద్రపర్చిన ఆధారాలు చోరీకి గురి కావడంప్రస్తుతం కలకలం రేపుతుంది.  కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురికావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

కాగా, నెల్లూరు కోర్టులో చోరీ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు  ఏప్రిల్ 17న ఎస్పీ విజయరావు చెప్పారు. కోర్టులో చోరీకి గురైన వస్తువులను రికవరీ చేశామని ఆయన వివరించారు. ఆదివారం నాడు నెల్లూరు ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం నిందితులు వచ్చారన్నారు. కుక్కలు వెంబడించడంతో నిందితులు కోర్టు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని ఎస్పీ చెప్పారు. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారు అన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios