‘అదో దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్’.. : విజయ్ సాయి పై రఘురామకృష్ణరాజు ఫైర్

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి మీద ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయి వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

ycp rebal mp raghurama krishna raju fires on vijaysai reddy over tweet - bsb

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి మీద ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయి వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై స్పందించిన రఘురామ కృష్ణరాజు దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్ గా దాన్ని అభివర్ణించాడు. ప్రత్యర్థిని అయినా గౌరవించాలని రామాయణం చెబుతోందని, చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంథాలు చదువుకుంటే మర్యాద లక్షణాలు వచ్చేవేమో అని వ్యాఖ్యానించారు. 

‘నిన్న మీరు చేసిన దరిద్ర ట్వీట్ వలన పార్టీ పరువు పోయింది. పార్టీ ఇమేజ్ పోయింది. జాతీయ కార్యదర్శివి, రాజ్యసబలో సభ్యుడివి.. మా అందరికీ పార్లమెంటులో నాయకుడివి. అసలు బుద్దుందా.. అలా మాట్లాడతాడేంటి.. ఇదా సంస్కారం’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘సీఎం, నేను విష్ చేశాం కదా. తప్పు సాయిరెడ్డి గారు.. మీ సంకుచిత స్వభావాన్ని చూపకండి. ఇలా చెత్త మాట్టాడితే మీకేదో గండపెండేరం తొడుగుతాడని అనుకుంటున్నారేమో... ఇతరులను మీరు గౌరవిస్తే.. సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీ దిక్కుమాలిన పోస్టులను సోషల్ మీడియాలో తప్ప సంస్కారం ఉన్నవాళ్లు ఎవరూ లైక్ చేయరు. 

‘‘ఏడుపు బతుకులు అంతే’’ నంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు...

దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్ల వల్ల తటస్తంగా ఉన్న 15 శాతం ఓటింగ్ పోతుంది. మీ వికృత చర్యల వలన ఎవరినైతే మీరు విమర్శించారో అక్కడికే ఆ ఓటింగ్ శాతం పోతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. సీఎం గారు మీరు జాతీయ కార్యదర్శిగా వేరొకరిని నియమిస్తే బాగుంటుంది. 

ఒకవేళ మీరే చేయించి ఉంటే.. ఏమీ చేయలేమనుకోండి. ఒక వేళ పార్టీ పరువు గంగలో కలిసి పోతుందని.. మీరు భావిస్తే గనక.. కొంచెం సంస్కారం ఉన్నవాల్లనెవరినైనా.. పెద్దలు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లాంటి వారిని నియమించండి...’’ అని రఘురామ రాజు వ్యాఖ్యానించారు. 

కాగా మంగళ వారం పుట్టినరోజు జరుపుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా గ్రీటింగ్స్ తెలిపారు. ‘‘ ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు’’ అంటూ ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios