Asianet News TeluguAsianet News Telugu

వైసిపి క్రిమినల్స్ పార్టీయే అనుకున్నా... గంజాయి పార్టీ కూడా..: టిడిపి అనురాధ ఎద్దేవా

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేసిన వైసిపిపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. వైసిపిని క్రిమినల్ పార్టీ మాత్రమే అనుకున్నానని కానీ అది గంజాయి పార్టీ అనికూడా తేలిందని ఎద్దేవా చేసారు. 

ycp not only criminal party...its ganja party also... panchumarthi anuradha
Author
Amaravati, First Published Oct 20, 2021, 4:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: వైసీపీ క్రిమినల్ పార్టీ మాత్రమే కాదు గంజాయి పార్టీ కూడా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేసారు. గంజాయి పార్టీ కార్యకలాపాలను టీడీపీ బట్టబయలు చేస్తోందనే అక్కసుతోనే దాడులకు తెగబడ్డారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు దండెత్తాయని panchumarthi anuradha ఆరోపించారు. 

''YCP నేతల ప్రోద్భలంతోనే ఆ పార్టీ కార్యకర్తలు గంజాయి, మద్యం మత్తులో వచ్చి TDP Office లోని సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. డీజీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా?'' అంటూ అనురాధ ఆందోళన వ్యక్తం చేసారు. 

''టిడిసి కార్యాలయంపై దాడి ఘటన గురించి మాట్లాడకుండా మంత్రి botsa satyanarayana మొదలు ఎమ్మెల్యే gudiwada amarnath reddy వరకూ తమ పదవులు కాపాడుకునేందుకు ఇష్టమొచ్చినట్టు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తామెప్పుడు అసభ్య భాష మాట్లాడలేదని ముఖ్యమంత్రి ys jagan సాక్షిలో ప్రకటనలు ఇస్తున్నారు. నాడు నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా దిగజారి మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు'' అన్నారు. 

''33 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చేశారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు. ఆ విషయం మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నీ తల్లికి పెందుర్తిలో టీడీపీ టికెట్ ఇచ్చిన విషయం గుర్తులేదా?'' అని నిలదీసారు.

read more  టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు: 36 గంటల పాటు దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్

''అకారణంగా nara lokesh , ashok babu పై ఏ1, ఏ2 ముద్దాయిలంటూ కేసులు పెడతారా? వాళ్లు ఏం చేశారని కేసు పెడతారు? ఏ1 అంటే జగన్ రెడ్డి, ఏ2 అంటే వvijayasai reddy  గుర్తొస్తారు ప్రజలకు . ఒక్క కేసు కూడా లేని లోకేష్ పై ఏ1 ముద్దాయని కేసు పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి?'' అని మండిపడ్డారు.

''hyderabad cp ఏపీ డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు చెప్పారు. త్వరలో సాక్ష్యాలతో సహా వైసీపీ డ్రగ్స్ మాఫియాపై ప్రెస్ మీట్ పెడతాను. అప్పుడు మీరు చేసిన అక్రమాలు బయటపెడతాను'' అని అనురాధ హెచ్చరించారు. 

''టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై హోంమంత్రి mekathoti sucharitha ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా అర్ధమవుతోందా? నరసరావుపేట వైసీపీ ఎంపీ lavu srikrishnadevarayalu తమ విద్యాసంస్థల్లో డ్రగ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించమని డీఐజీ స్థాయి అధికారిని పిలిపించారు'' అని అనురాధ గుర్తుచేసారు. 

''ఎటుపోతోంది రాష్ట్రం? మీ బెదిరింపులకు బెదరం. అదరం. ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రంలో డ్రగ్స్ బారినపడిన వారు ఎందరున్నారో, ఎంతమంది సైకియాటిస్ట్ దగ్గరకు వెళుతున్నారో పోలీసులు ఆరా తీయడం మానేసి దాడులకు తెగబడుతున్నవారికి కొమ్ముకాస్తారా? చేనేత వర్గానికి చెందిన సోషల్ మీడియా ఇన్ చార్జ్ పై దాడి చేశారు. వైసీపీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం'' అని అనురాధ స్పష్టం చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios