YCP- Cong Alliance:  ఏపీ లో అప్పుడే ఎల‌క్ష‌న్ హీట్ ప్రారంభ‌మైంది. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ- కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకోబోతున్నాయ‌నే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా పరిస్థితిపై వైసీపీ ఎంపీ   విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. 

YCP - Cong Alliance: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అప్పుడే ఎన్నిక‌ల వేడి క‌నిపిస్తోంది. ప్ర‌ధాన పార్టీలు టార్గెట్ 2024 దృష్టి సారిస్తూ.. పావులు క‌దుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఏపీ రాజ‌కీయాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాడ‌నే ఉహాగాహాలు మొద‌ల‌య్యాయి. ఈ తరుణంలో అధికార వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఈ పొత్తు అసలు ఇది సాధ్యమా? అసాధ్యమా? మాట ప‌క్క‌న పెడితే.. ఈ ఊహాగానాల‌తో ఏపీ పొలిటిక‌ల్ హీట్ ను అమాంతం పెరిగింది. మ‌రో వైపు.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారాన్ని చేప‌డుతామ‌నీ, ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగానే బ‌రిలో దిగుతోంద‌ని ప‌లువురు వైసీపీ నేతలు చెపుతున్నారు.

ఈ త‌రుణంలో తాజాగా ఈ పొత్తుల అంశాలపై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కార్ల‌టీ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత చూసుకుంటారని ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఏయూ వై వి ఎస్ ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియా తో మాట్లాడారు. తాను ఏ రోజు ఏ పదవి కోరుకోలేదని, పార్టీ అధినేత గా జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇస్తే ఆ బాద్యతను నిర్వర్తించడం తన కర్తవ్యం అన్నారు. వైసిపి క్రియశిల సభ్యుడిగా నుంచి రాజ్య సభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నేత గా, ఇప్పుడు అనుబంధ సంఘాల క్రియాశీల నాయకుడిగా నా భాధ్యతను నిర్వహిస్తున్నని తెలిపారు 

ఇదే స‌మయంలో ఈ ప్రతిపాదనలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహర తీరును గుర్తు చేశారు. ఆ రోజుల్లో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదురించే వారు ఎవరూ లేరని.. ఆ సమయంలోనే జగన్ ఎదిరించి నిలబడ్డారన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు.. వైఎస్సార్‌సీపీ పుట్టిందని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు. కానీ వాటిని అమలు చేయాలో? లేదో? నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అధినేత మాత్రమే అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదురించి నిలబడ్డారని.. అలాంటిది కాంగ్రెస్‌తో పొత్తా.. నవ్విపోతారంటూ ఎద్దేవా చేశారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చిందని విమ‌ర్శించారు.

ప్రశాంత్ కిషోర్.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్య‌వ‌హ‌రించారు. ఆ ఎన్నికల్లో పీకే టీమ్ కీలక పాత్ర పోషించింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీల కోసం పనిచేశారు. అయితే.. ప్ర‌శాంత్ కిషోర్ .. తాజాగా కాంగ్రెస్ తో క‌లిసి అడుగులు వేయ‌బోతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్‌సీపీలో పొత్తు ఉంటుందనే ప్రచారం ప్రారంభ‌మైంది. అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, మహారాష్ట్రలో ఎన్సీపీతో, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని చెప్పారట. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రి అమర్‌నాథ్ స్పందించారు.