ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడానికి టీవీ ఛానళ్ళు సరిపోలేదనో ఏమో, సోషల్ మీడియా వేదికగా కూడా ఆరోపణలను గుప్పిస్తున్నారు. 

కాకపోతే ఇలా సోషల్ మీడియా వేదికగా చేసే యుద్ధంలో నేతలు తమ క్రియేటివిటీకి పనిచెబుతూ చాలా హిలేరియస్ గా కూడా కొన్ని సార్లు అవతలి వ్యక్తులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. 

ఈ కోవలోకే వస్తారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. ఆయన ట్విట్టర్లో చాలా ఆక్టివ్ గా ఉంటారు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాడు సిద్ధంగా ఉంటారు. తాజాగా కొన్ని గంటల కింద మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. అక్కడితో ఆగకుండా, ఆయన తనయుడు లోకేష్ పై కూడా మంచి సెటైర్లు వేశారు. 

Also read: పవన్ జీరో అంటూ విజయసాయి ట్వీట్... నాగబాబు కౌంటర్ ‘అదిరింది’

రాజధాని విషయమై చంద్రబాబు అనవసర రాదంతం చేస్తున్నారని ఎప్పటినుండో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విజయసాయి రెడ్డి నేటి ఉదయం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలను వ్యంగ్యంగా సంధించారు. 

చంద్రబాబు ను ఉద్దేశిస్తూ..."ప్రధానులను డిసైడ్ చేశాను. రాష్ట్రపతులను సెలెక్ట్ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్ సైడర్ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యుడీషియల్ క్యాపిటల్ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట." అని రాసుకొచ్చారు. 

ఇక మరో ట్వీట్లో చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై కూడా సెటైర్లు వేశారు. " ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని" అని ట్విట్టర్లో లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు.