బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుకు నోటీసులు

First Published 23, Mar 2018, 3:16 PM IST
Ycp mp vijaya sai to serve privilege notice to chandrababu
Highlights
  • తనకు ప్రధానిని కలిసే హక్కు ఉందన్నారు.

చంద్రబాబునాయుడును వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వదిలిపెట్టేలా లేరు. బోనులో నిలబెతానని చేసిన సవాలును ఆచరణలోకి తెచ్చేట్లే కనబడుతోంది. తాజాగా సిఎంకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని వియసాయిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ప్రధానిని కలిసే హక్కు ఉందన్నారు. ప్రధాని కార్యాలయం నేరస్తుల అడ్డాగా మారిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానన్నారు. అలాగే తనపై ఉన్న కేసుల మాఫీకోసమే ఎన్డీఏతో మళ్లీ కలవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

loader