విశాఖ క్రేన్ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టకూడదన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. క్రేన్ క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం పాలవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

ఈ ఘోర దుర్ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు విజయసాయి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి పట్ల తన హృదయం చలించిపోయిందని, వారు ఈ విషాదం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.

Also Read:విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాదం: అనుపమ్ క్రేన్ సంస్థపై కేసు

ఈ ఘటనలో శాఖాపరమైన విచారణ షురూ అవుతుందని వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి అనుపమ్ క్రేన్ సంస్థపై విశాఖ పోలీసులు 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2017 ఆగస్టులో ఈ క్రేన్ షిప్ యార్డ్‌కు చేరుకుంది.

అయితే ఈ క్రేన్‌లో లోపాలను గుర్తించడంతో దానిని మూడేళ్లుగా హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉపయోగించడం లేదు. గ్రీల్ ఫీల్డ్, లీడ్ ఇంజనీర్స్, స్వ్యాడ్ సంస్థల సహాయంతో ఈ భారీ క్రేన్‌ను గుర్తించిన లోపాలను సరి చేయించారు.