విశాఖపట్టణం:విశాఖపట్టణం హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేశారు. అనుపమ్ క్రేన్ సంస్థపై విశాఖపట్టణం పోలీసులు 304(ఎ) సెక్షన్ కింద ఆదివారం నాడు కేసు నమోదు చేశారు.

హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలిపోవడంతో 11 మంది మరణించారు. శనివారం నాడు మధ్యాహ్నం ఈ భారీ క్రేన్ కుప్పకూలింది.  దీంతో క్రేన్ కింద పడి 11 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

also read:హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం: 11 చేరిన మృతుల సంఖ్య (చూడండి)

2017 ఆగష్టు మాసంలో ఈ క్రేన్ షిఫ్ యార్డుకు చేరుకొంది. అయితే ఈ క్రేన్ లో లోపాలను గుర్తించడంతో దాన్ని మూడేళ్లుగా హిందుస్థాన్ షిప్ యార్డు ఉపయోగించడం లేదు.అయితే ఈ క్రేన్ ను ఉపయోగించేందుకు గాను అధికారులు ప్రయత్నాలను ఇటీవల మొదలు పెట్టారు.

గ్రీల్ ఫీల్డ్, లీడ్ ఇంజనీర్స్, స్వ్యాడ్ 7 సంస్థల సహాయంతో ఈ భారీ క్రేన్ ను గుర్తించిన లోపాలను సరి చేయించారు. షిప్ యార్డులోని స్లిప్ వే జెట్టీ -4 వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

క్రేన్లను ఆపరేట్ చేసే సమయంలో ఒకరు లేదా ఇద్దరు ఆపరేటర్లు మాత్రమే ఉంటారు. కానీ క్రేన్ కేబిన్లో ప్రమాదం జరిగే సమయంలో సుమారు 10 మంది ఉన్నారని తెలుస్తోంది.