Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎలక్షన్స్ నుండి టిడిపిని సైడ్ చేసిందే పురంధీశ్వరి... ఎందుకో తెలుసా? : విజయసాయి సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ బిజెపి ఓడిపోయేలా... కాంగ్రెస్ గెలిచేలా రాాజకీయాలు చేసారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 

YCP MP Sensational comments on Andhra Pradesh BJP Chief Purandeswari AKP
Author
First Published Nov 16, 2023, 1:05 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి, అధికార వైసిపి ఎంపీ విజయసాయి మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరింది. బిజెపి పార్టీలో వున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పురంధీశ్వరి రాజకీయాలు, వ్యవహారాలు వుంటున్నాయని విజయసాయి ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయాల గురించే కాదు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం ఏపీ రాజకీయాల గురించి  మాత్రమే ప్రస్తావించిన విజయసాయి రెడ్డి తాజాగా తెలంగాణ రాజకీయాల్లో పురంధీశ్వరి వేలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

తెలంగాణలో ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలన్న ఆలోచనలో పురంధీశ్వరి వున్నారని విజయసాయి పేర్కొన్నారు. అయితే సొంత పార్టీ బిజెపిని గెలిపించుకోవాలనే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపడినట్లే... కాంగ్రెస్ గెలుపుకోసం ఈ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ కు మద్దతుగానే తెలుగుదేశం పార్టీని అక్కడ పోటీలో నిలపొద్దని సలహా ఇచ్చిందే పురంధీశ్వరి అంట... అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ లో తమ ఆస్తులు కాపాడుకునేందుకే పురంధీశ్వరి కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. కాంగ్రెస్ ను గెలిపించుకుంటే తాము  అధికారంలో వున్నట్లేనని పురంధీశ్వరి అనుకుంటున్నారని... తద్వాారా తమ సామాజిక వర్గానికి చెందినవారి ఆస్తులను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇలా పురంధీశ్వరి బిజెపి గురించి కాకుండా తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని అన్నారు.  

Read More  బాలకృష్ణ వర్సెస్ గోరంట్ల మాధవ్ : ముద్దులు పెట్టాలి, కడుపులు చేయాలన్న ఎమ్మెల్యేను ఓడించాలి..

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకోవడానికి పురంధీశ్వరి ఎన్ని విన్యాసాలైనా చేస్తారని విజయసాయి అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కోసం టిడిపిని సైడ్ చేసేసారని... ఇలాంటివి ఎన్నయినా చేయడానికి సిద్దంగా వున్నారన్నారు.  బిజెపిని గెలింపించుకునేందుకు తెలంగాణతో పాటు జాతీయ నేతలు ప్రయత్నిస్తుంటే పురంధీశ్వరి మాత్రం కాంగ్రెస్ కు పనిచేస్తున్నారని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పురంధీశ్వరి చేస్తున్న విమర్శలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ''చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios