బాలకృష్ణ వర్సెస్ గోరంట్ల మాధవ్ : ముద్దులు పెట్టాలి, కడుపులు చేయాలన్న ఎమ్మెల్యేను ఓడించాలి..
బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

హిందూపురం : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఇక మరికొందరు నేతలు అయితే ఆ పచ్చ గడ్డి వేయకుండానే.. తమ మాటలతో ఎదుటివారిని రెచ్చగొట్టి మంటలు పుట్టిస్తుంటారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా.. సందు దొరికితే చాలు తమ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ఘటనే హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత, నటుడు నందమూరి బాలకృష్ణ మీద ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బాలకృష్ణను నమ్మి హిందూపురం ప్రజలు అసెంబ్లీ స్థానానికి గెలిపిస్తే ఆయనేమో మూడు ఘనకార్యాలు వెలగబెట్టారంటూ గోరంట్ల మాధవ్ ఆరోపణలు చేశారు. బాలకృష్ణ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురంలో నిర్వహించిన సభలో గోరంట్ల మాధవ్ ప్రసంగించారు. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాలకృష్ణను రెండుసార్లు గెలిపించారని గుర్తు చేశారు. 40 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఏపీని పరిపాలించింది. ఈ పరిపాలనా కాలంలో బాలకృష్ణ మూడు ఘనకార్యాలు చేశారంటూ ఎద్దేవా చేశారు.
Narendra Modi: ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చిన మహిళ
ఆయన చేసే ఘనకార్యాల్లో ఒకటి.. రాత్రి అయితే ఫుల్ బాటిల్ ఎత్తడం.. తెల్లారితే ఓటర్లను తన్నడం.. అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటుడిగా ఉన్న సమయంలోనే బాలకృష్ణ తనకు హిట్ సినిమా ఇచ్చిన నిర్మాత మీదే కాల్పులకి పాల్పడ్డాడు. ఆయనను చంపేందుకు ప్రయత్నించాడు. ఇది ఆయన చేసిన రెండో ఘనకార్యం అని చెప్పుకొచ్చారు. మూడో ఘనకార్యం అత్యంత దారుణమైనదని ఇలా ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకుఎంతో అండగా నిలిచారని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు అదే సమయంలో తెలుగుజాతి ఆత్మగౌరవం అంటూ మాట్లాడే పార్టీకి చెందిన బాలకృష్ణ మాత్రం మహిళలను అవమానించేలా.. కించపరిచేలా మాట్లాడుతుంటారని మండిపడ్డారు. మహిళలు పూజింపబడాలని, గౌరవించబడాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి నేత బాలకృష్ణ మాత్రం.. అమ్మాయి కనబడితే చాలు కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అంటూ అతి దారుణంగా మాట్లాడుతుంటారు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి ఎవరు ఓటు వేయొద్దన్నారు. ముద్దులు పెట్టాలి. కడుపులు చేయాలన్న ఎమ్మెల్యేను ఓడించాలి.. అని ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ దూపురం నియోజకవర్గం లో చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి కార్యకర్తలు, టిడిపి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గోరంట్ల మాధవ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని మీద బాలకృష్ణ స్పందన కోసం వేచి చూస్తున్నారు.