Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వ్యాఖ్యలు: సజ్జలపై రఘురామ కృష్ణంరాజు ఫైర్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్‌ హోదా కలిగి ప్రతినెలా ప్రజాధనాన్ని జీతభత్యాల కింద తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వోద్యోగి కిందకే వస్తారన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచేలా ఆయన ఎలా మాట్లాడతారని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 

ycp mp raghuramakrishnam raju fires on sajjala ramakrishnareddy - bsb
Author
Hyderabad, First Published Jan 29, 2021, 9:08 AM IST

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్‌ హోదా కలిగి ప్రతినెలా ప్రజాధనాన్ని జీతభత్యాల కింద తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వోద్యోగి కిందకే వస్తారన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచేలా ఆయన ఎలా మాట్లాడతారని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 

రాజధాని రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగతంగా దూషణలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
‘‘సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల నిర్వహణపై విస్పష్టమైన తీర్పు వెలువడ్డాక కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు చేస్తుంటే..అసలు ఆయనెవరన్న ఆసక్తి రాష్ట్రమంతా నెలకొంది. నేను కూడా ఆయనెవరో తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆయన వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. సీఎం జగన్‌ సొంత పత్రికలో ఎడిటోరియల్‌ బోర్డు సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది సలహాదారుల్లో ఒకరిగా సజ్జల నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన కీలకమైన ప్రజా సంబంధాలు-ప్రజా వ్యవహారాల పోస్టులోఉంటూ కేబినెట్‌ హోదా అనుభవిస్తున్నారు. ఆయనకు సెక్రటేరియేట్‌లో గదిని కేటాయించారు. కేబినెట్‌ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నందున ప్రస్తుతం ఆయన ప్రభుత్వోద్యోగి కిందే లెక్క’’ అని వివరించారు. 

‘‘పనికిమాలిన వారినందరినీ సలహాదారులుగా నియమించుకోవడమేంటి? వాళ్లకు కేబినెట్‌ ర్యాంకులు ఇవ్వడమేంటి? ఎవరైనా హైకోర్టును ఆశ్రయిస్తే సజ్జలకు ఇచ్చిన హోదా తొలగిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios