వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివగామి ఎవరు? అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. కేసులో దోషుల్ని తొందరగా తేల్చాలని సీబీఐని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : YS Vivekananda Reddy హత్య కేసులో అసలు దోషులెవరో CBI త్వరితగతిన తేల్చాలని వైసీపీ ఎంపీ Raghurama Krishnaraju డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంతకీ వివేకా murder caseలో శివగామి ఎవరు? అని ప్రశ్నించారు. ‘సిబిఐ ఛార్జిషీట్ లో ఉన్న వారిని వారం రోజుల్లో విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒక వ్యక్తి అప్రూవర్గా మారి 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని 306 రికార్డు చేసే సందర్భంలో మార్చడానికి వీలు పడదు.
అయితే తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి అదనంగా ఏదైనా సమాచారం ఉంటే జోడించవచ్చు. సకల శాఖ మంత్రి సజ్జల సిబిఐ విచారణ గురించి మాట్లాడడం విచారకరమ’ని ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డు సమావేశం చేపల మార్కెట్ లా జరిగింది అని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా స్వామివారి సేవల రేట్లను పెంచడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మత్స్యకారులకు సంబంధం లేని జీవోతో లాభాలు ఎలా వస్తాయో మంత్రి అప్పలరాజు సమాధానం చెప్పాలని కోరారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy బాబాయ్ మాజీ మంత్రి YS Vivekananda Reddyని కడప ఎంపి YS Avinash Reddy తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారని అనుమానం ఉందని సిబిఐ ఈ నెల 15న పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్సభ నియోజకవర్గం టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు లేదా వైయస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని…ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఆయనను హత్య చేయించి ఉంటారని అనుమానం ఉందని వివరించింది.
తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి అని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికి తీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు దర్యాప్తులో గుర్తించిన అంశాలను CBI అందులో ప్రస్తావించింది.
వివేకానంద చంపినట్లు అంగీకరిస్తే రూ. పది కోట్లు : వివేకానంద రెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకొని, అతని నువ్వే చంపిన్నట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తామని గంగిరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరి సిబిఐ అధికారులు విచారణ కోసం ఢిల్లీకి పిలిపించిన విషయం శివశంకర్ రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్ చేస్తామంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. ఢిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు సిబిఐ ఆయనను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్ యాదవ్ ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకాహత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి భాగస్వాములయ్యారు.
ఎమ్మెల్సీగా పోటీ కి అడ్డు తగిలారని..
వివేకా హత్యకు కుట్ర హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కడప జిల్లా వైసీపీలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతు ఇవ్వలేదు. ఓటమిపాలైన వివేకా.. శివశంకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వివేకా వైసీపీలో చేరితే రాయలసీమలో తన ప్రాబల్యానికి ఇబ్బంది అవుతుందని భావించిన శివశంకర్ రెడ్డి.. ఆయన చేరిక పైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
