వైఎస్ వివేకా హత్య కేసులో మిగిలిన సాక్షులనైనా కాపాడండి: ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిగిలిన సాక్షులనైనా కాపాడాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్:YS Viveknanda Reddy హత్య కేసులో ప్రస్తుతం ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబెల్ ఎంపీ Raghurama Krishnam Raju కోరారు.
ఆదివారం నాడు ఆయన Hyderabad లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.ఇప్పటికే ముగ్గురు సాక్షులు చనిపోయారన్నారు. మరో వైపు ఇటీవల చనిపోయిన గంగాధర్ రెడ్డి మరణంపై YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు తప్పు బట్టారు.
ఏపీ ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రూ. 8 వేల కోట్ల లిక్కర్ బాండ్లను విడుదల చేసిందన్నారు. మార్జిన్ పేరుతో బెవరేజేస్ కు ఆదాయాన్ని చూపించారన్నారు. ఈ ఆదాయంపై ఏపీ ప్రభుత్వం రూ., 8 వేల కోట్ల రుణం తీసుకుందని చెప్పారు. లిక్కర్ బాండ్లపై ఏపీ సర్కార్ రుణం తీసుకున్న విషయమై కోర్టులో కేసు వేసినట్టుగా రఘురామకృష్ణం రాజు చెప్పారు.
also read:బెదిరింపులకు భయపడను:వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్
మద్యపాన నిషేధానికి ఏపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆయన విమర్శించారు.2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని YS Jagan ఇచ్చిన హామీని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.పార్టీ విప్ ధిక్కరిస్తే తనపై వేటు వేసే అవకాశం ఉందన్నారు. అనర్హత వేటు నియమావళి ప్రకారమే జరగాలని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే నెల 4న తన నియోజకవర్గంలో ప్రధాని Narendra Modi పర్యటన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనాలని అనుకొంటున్నట్టుగా చెప్పారు. ఈ విషయమై CISF, IB నివేదిక తెప్పించుకుంటానన్నారు. తన నియోజకవర్గానికి వెళ్లడానికి అనుకూల వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తే వెళ్తానని ఆయన వివరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు గంగాధర్ రెడ్డి ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు. Yవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేసులో తనపై CBI అధికారులు ఒత్తిడి చేశారని గంగాధర్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాదు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ విషయమై అప్పటి అనంతపురం ఎస్పీకి కూడా పిర్యాదు చేశారు. యాడికిలోని తన నివాసంలోనే గంగాధర్ రెడ్డి మరణించాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి గతంలోనే పోలీసులకు పిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులతో పాటు సీబీఐ నుండి తనకు ప్రాణహాని ఉందని 2021 నవంబర్ 29న అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు ఫిర్యాదు చేశాడు. తనకు సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని కూడా ఆ ఫిర్యాదులో గంగాధర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ సమయంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ విషయమై అప్పటి అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ స్పందించారు. గంగాధర్ రెడ్డి పిర్యాదు ఆధారంగా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని కూడా ఎస్పీ ఫకీరప్ఫ అప్పట్లోనే మీడియాకు చెప్పారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారనే అంశంతో పాటు గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశంపై విచారణ చేస్తామని ఎస్పీ వివరించారు.