Asianet News TeluguAsianet News Telugu

బెదిరింపులకు భయపడను:వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్

గత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి వల్లభనేని వంశీ విజయం సాధించాడని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. వల్లభనేని వంశీ బెదిరింపులకు తాను భయపడనని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే తాను సహకరించబోనని ఆయన చెప్పారు. 

YCP Leader Yarlagadda Venkat Rao  Reacts On Vallabhaneni Vamsi Comments
Author
Vijayawada, First Published Jun 12, 2022, 1:56 PM IST

గన్నవరం:గత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి Gannavaram నుండి Vllabhaneni Vamsi  విజయం సాధించాడని YCP  నేత Yarlagadda Venkat Rao ఆరోపించారు. నకిలీ ఇళ్ల పట్టాలు కూడా వంశీ విజయానికి దోహదమయ్యాయన్నారు.

గన్నవరంలో నైతికంగా తానే విజయం సాధించానని ఆయన చెప్పారు. వంశీ బెదిరింపులకు తాను భయపడనని ఆయన తేల్చి చెప్పారు. వంశీకి భయపడేవాడిని అయితే గత ఎన్నికల్లో తాను గన్నవరం నుండి ఎందుకు పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు.

ఆదివారం నాడు యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.వంశీ ఉపయోగించిన అసభ్య పదజాలంపై తాను వ్యాఖ్యలు చేయబోనన్నారు.  ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. కానీ అసభ్యంగా దూషించుకోవడం కోసం రాజకీయాల్లోకి  రాలేదన్నారు. 

ఈ రకంగా దూషించుకోవడం వల్ల ప్రజలకు ఏం చెబుతామన్నారు.  వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయించేది YCP  నాయకత్వమన్నారు. నియోజకవర్గంలో తన అనుచరుల ఇళ్లలో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరైతే తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. 13 నెలల పాటు KDCC  బ్యాంకు చైర్మెన్ గా ఉండి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టానని ఆయన గుర్తు చేశారు.

TDP లో ఉన్న సమయంలో YS Jagan తో పాటు తమ పార్టీ నేతలను వంశీ తీవ్రంగా విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన అనుచరులపై కేసులు బనాయిస్తున్నారని దీని వెనుక వంశీ ఉన్నాడని ఆయన ఆరోపించారు. తన వర్గానికి ఏం చేయలేకపోయాయని అనేక నిద్రలేని రాత్రులు కూడా గడిపినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాకు వివరించారు.

also read:వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే సహకరించను: వైసీపీ నేత దుట్టా రామచంద్రారావు

రెండు రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో పర్యటించిన యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు వంశీ స్పందించారు. 2019 గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని అతడిని పార్టీలోకి తీసుకోవడాన్ని కూడా తాను వ్యతిరేకించినట్లు యార్లగడ్డ వెంకట్రావు ఈ నెల 10న వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 11న  వంశీ  స్పందించారు. తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునన్నారు. జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన తనకి గన్నవరం బాధ్యతలు అప్పగించారని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

ఈ విషయమై ఏదైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలన్నారు. ఇంకా ఇబ్బందులుంటే నేరుగా జగన్ దగ్గరికి వెళ్లొచ్చని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుని ఉద్దేశిస్తూ వంశీ వ్యాఖ్యానించారు.. జస్టిస్ చౌదరిలుగా రోడుపై వెళ్లే ప్రతివాడూ కామెంట్స్ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios