జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ వారన్నా రోజు విమర్శలు చేస్తారో చేయ్యరో కానీ.... సొంతపార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మాత్రం విరుచుకుపడని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు తప్పులను ఎత్తిచూపెడుతూ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. 

తాజాగా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూలిపోయే ప్రమాదంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఫోన్‌ ట్యాపింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో న్యాయవస్థపై ఆంధ్రజ్యోతి పత్రికలో న్యాయవస్థపై నిఘా పెట్టారు అనే కథనం వచ్చింది. దానిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రభుత్వానికి, న్యాయవావస్థకు మధ్య దూరం పెంచే ప్రయత్నాన్ని  చేస్తుందని ప్రభుత్వం ఆరోపించి దీనిపై విచారణకు ఆదేశించింది. 

ఫోన్ టాపింగ్ ఆరోపణలు గనుక నిజమయితే... విచారణ చేపట్టవలిసిందే నాని, తన ఫోన్ కూడ టాప్ అవుతుందని తనకు అనుమానం ఉందన్నారు రఘురామ.

నిన్న రఘురామ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో రెడ్ టేపిజం లేదు కానీ రెడ్దిజం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పదవులన్నీ కూడా తన సొంతకులానికే కట్టబెడుతున్నాడని దుయ్యబట్టారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు "హే మళ్ళీ ఏసేశాడు" అన్నట్టుగా జగన్ మళ్ళీ రెడ్లకు పదవి కట్టబెట్టేసాడు అని అనుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు.

మచ్చుకకు చదువుతాను అంటూ రాష్ట్రంలో విప్ లుగా ఉన్నవారేరి పేర్లు చదువుతూ... గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒకే కులానికి ఇన్ని విప్ లా అంటూ ఆయన ధ్వజమెత్తారు. 

దానితోపాటుగా సీఎం కార్యాలయంలో సలహాదారుల పేర్లను కల్లాం అజేయ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అంటూ చదువుకొచ్చారు. ఇక ఆ తరువాత టీటీడీ బోర్డును చూపిస్తూ... చైర్మన్ గా సుబ్బా రెడ్డి, సభ్యులుగా పుట్టా ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి..... ఇలా వరుసగా కమిటీలను కూడా చదివాడు. రాష్ట్రంలో వేరే కులమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.