Asianet News TeluguAsianet News Telugu

గోరంట్ల మాధవ్ కు 500 కార్లతో స్వాగతమా? ఇలా చేస్తేనే దేశమంతా మీ వైపే చూస్తారు... ఎంపీ రఘురామ ఎద్దేవా..

గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మరోసారి ఫైర్ అయ్యారు. అలాంటి వాడికి 500కార్లతో స్వాగతం పలకడం ఏంటీ అంటూ మండిపడ్డారు. 

YCP MP Raghu Rama Krishnam Raju fire on Gorantla Madhav and YS Jagan
Author
Hyderabad, First Published Aug 13, 2022, 10:48 AM IST

ఢిల్లీ : రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి.. చిత్రహింసలు పెట్టి.. ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు 500కార్లతో  భారీ స్వాగతం పలకడం ఏమిటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం తమవైపు చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరుచూ చెబుతుంటారని, ఈ రకమైన ప్రోత్సాహంతో నిజంగానే దేశమంతా తమ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఇప్పటికే చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తిపన్ను పేరిట భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇంపాక్ట్ పన్ను భారంతో ఎన్నికలకు వెడితే జనం తమను ఉతికి ఆరేస్తారని పేర్కొన్నారు. విజయమ్మ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. ఒకే సమయంలో రెండు టైర్లు బద్దలవ్వడం వెనక ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని రఘురామ డిమాండ్ చేశారు.

కాగా, రాష్ట్ర ప్రజలు, అక్క చెల్లెలు, తల్లులు సెల్ ఫోన్లు చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ‘వాంటెడ్ పండుగాడు’ చిత్ర యూనిట్ గురువారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది.  ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందించారు వరలక్ష్మీ వ్రతం ముందు రోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు.

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై జగన్ వేగంగా స్పందించాలి.. రఘురామకృష్ణంరాజు

దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు.  పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఉండాల్సిన చోట ఇలాంటి వారు ఉన్నారని విమర్శించారు. ‘ గతంలో వారం రోజుల పాటు  నా మీద ప్రెస్ మీట్ పెట్టారు.. ఇప్పుడేవి?’  అని ప్రశ్నించారు.  ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్  లేదన్నారు. ‘ అనంతపురం  ఎస్.పి  విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే.. మాధవ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది. ఎవరో చేశారు. ఒరిజినల్ క్లిప్ ను కనిపెట్టలేకపోయాం… అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి.

ఫోరెన్సిక్ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్ దేనని  తేలుతుంది. అంతకుమించి వేరే ఏమి రాదు. ఆయన పృద్వి కాదు కదా.. మాకు అంగ బలం అర్ద బలం ఉంటే.. అద్భుతం అంటారు’ అని పృథ్వీరాజ్ వివరించారు. 

గోరంట్ల మాధవ్ వీడియోపై ఆగస్ట్ 4న రఘురామ స్పందించారు. ఈ  ఘటనపై  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో, ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు వీడియోలు మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్  డిపార్ట్మెంట్ కి పంపిస్తే తప్ప  ఘటనలోని అసలు విషయం బయటపడుతుంది. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ వేగంగా స్పందించాలి. పార్లమెంట్ సాక్షిగా  నన్నే బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై మా పార్టీలో ఎవరు స్పందించాలన్నా.. తాడేపల్లి లో ఒక ‘కీ’ ఉంటుంది.  తాడేపల్లి ‘కీ’ ప్రకారమే మా నేతలు నడుచుకుంటారు’ అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios