రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ  రోడ్డు ప్రామాదం నుండి తృటిలో బయటపడ్డాడు. మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయిఈ ప్రమాదం నుండి మోపిదేవి వెంకటరమణ తృటిలో బయటపడ్డారు. విశాఖ జిల్లా కశింకోటం మండలం తాళ్లపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇకపోతే తాజాగా వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.హైద్రాబాద్ గచ్చిబౌలి నుండి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

గచ్చిబౌలి నుండి విజయవాడకు వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులోని కోహెడ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం టైరు పేలిపోవడంతో ఆ వాహనం రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో ఈ వాహనంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ స్పాట్ లోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.