2019లో జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు

ycp mla visweswar reddy says jagan will cm  2019
Highlights

హాట్ న్యూస్

అనంతపురం జిల్లా ఉరవకొండ వైస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలను దగా చేయడానికి మహానాడుకు వేదిగగా మార్చుకున్నాడని విమర్శించారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం,ప్రజలకు ఇచ్చిన హామీలు, తనపార్టీ పని విధానం పట్ల సమీక్ష కాకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ డప్పుకొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో కేవలం 3% శాతం ఓట్లు కూడా లేని బిజెపిని విమర్శించడానికి సమయ కేటాయిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మోసాలను, విధానాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు విశ్రాంత ఐఎఎస్ లు, నాయమూర్తులు, మేధావులు కూడా తప్పుపడుతున్నారని అన్నారు. సోమవారం ఎమ్మెల్యే విశ్వ ఉరవకొండలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఆయన ఏమన్నారంటే.??

-చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు. మహానాడు వేదికగా వైస్సార్సీపీ పై దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో వైస్సార్సీపీ కలుస్తుందని చెప్పడం హాస్యాస్పదం. మీలాగా స్వప్రయోజనాల కోసం పూటకో పార్టీతో కలిసేది కాదు వైస్సార్సీపీ అంటే ఒక్కటే విధానంతో ఉంటాం.బీజేపీతో కలిసే ప్రసక్తేలేదు. ఇటు రాష్ట్రంలోను అటు పార్లమెంటులో వైస్సార్సీపీ ఎంపీల పోరాటాలు,నిరాహారదీక్షలు, రాజీనామాలు కంటికి కనిపించవా. కేసులంటే భయం లేదన్న బాబు హైదరాబాద్ నుండి ఎందుకు పారిపోయివచ్చాడో చెప్పాలి. రాష్ట్రంలో చంద్రబాబు ఒంటరయ్యాడు. రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశగా మార్చిన చంద్రబాబు.

చంద్రబాబు అనుభవం అంతా 40 ఏళ్లలో ఏపీకి 90వేల కోట్లు అప్పుగా వున్న దాన్ని నాలుగేళ్ళలో 2 లక్షల 30 వేలకోట్లకు పెంచడానికి ఉపయోగపడింది. చంద్రబాబు పాలనను అన్ని పార్టీలే కాకుండా మాజీ IAS లు, న్యాయమూర్తులు కూడా విమర్శిస్తున్నారు. రాష్ట్ర వృద్ధి రేటుపై పచ్చి అబద్దాలాడుతున్నాడు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంతో విఫలం. హోదా,ఎన్నికల మ్యానిఫెస్టోలో, ఇతర హామీలు బీజేపీపై తోసి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఏపీ కి జరిగిన అన్యాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దోషులే. బిజేపీ, టీడీపీ ఇద్దరు తోడు దొంగలు. ఈ చంద్రబాబును దేవుడు కూడా రక్షించలేడు,జైలుకు వెళ్లడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎవరు అడ్డుకోలేరు.

loader