Asianet News TeluguAsianet News Telugu

జగన్ ను చంపి అధికారంలోకి రావాలనే కుట్ర: టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలనం

ఏపీ సీఎం జగన్ ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గాల్లోనే కలిసిపోతారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

YCP MLA Thopudurthi Prakash Reddy Sensational comments on TDP
Author
Anantapur, First Published Dec 11, 2021, 1:10 PM IST

అనంతపురం: ఏపీ సీఎం Ys Jagan ను చంపి టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని వైసీపీ ఎమ్మెల్యే Thopudurthi Prakash Reddy  సంచలన వ్యాఖ్మలు చేశారు. అనంతపురం జిల్లా రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శనివారం నాడుమీడియాతో మాట్లాడారు జగన్ గాల్లోనే కలిసిపోతారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. హింసా రాజకీయాలకు, కుంభకోణాలకు Tdp కేరాఫ్ అడ్రస్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో రూ. 242 కోట్లను షెల్ కంపెనీలకు గతంలో చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేసిన Laxmi Narayana మళ్లించారని ఆయన ఆరోపించారు.  కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను చంపితే రూ. 50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలను కూడా  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

also read:మా బావ‌కు జ‌గ‌న్ అన్యాయం చేశారు - మర్రి రాజశేఖర్‌ బావమరిది వెంక‌టసుబ్బ‌య్య ఆరోప‌ణ‌

గత మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు గత మాసంలో పర్యటించారు. కడప జిల్లాలో పర్యటించే సమయంలోనే  ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాల్లోనే ప్రయాణించారు. కనీసం బాధితులను కలిసి పరామర్శించలేదు, గాల్లోనే వచ్చారు.. గాల్లోనే వెళ్లిపోయారన్నారు. జగన్ కూడా గాల్లోనే కలిసిపోతారని ఆయన వ్యాఖ్యానించారు ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్  సెటైర్లు వేశారు.వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు ఏం మాట్లాడారో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios