హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ నిధులపై మంత్రి లోకేష్ చేసి విమర్శలు అర్థరహితమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

నియోజక వర్గాలకు నిధులిచ్చామని ట్విటర్ లో చెప్పి ట్విటర్ నాయుడిగా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  ట్విటర్ లో కాకుండా అమరావతిలో చర్చకు సిద్దమేనా అని ఆయన సవాల్ చేశారు. 

లోకేష్ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు ప్రతిపక్ష శాసనసభ్యులకు టీడీపి ప్రభుత్వం నిధులను ఎగ్గొట్టిందని అన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నియోజకవర్గాల నిధులను దారి మళ్లిస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధిలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు .

బాధితుల నుంచి పర్సంటేజీలు తీసుకుంటున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని కూడా ఏ పార్టీకి చెందినవారని గుర్తించి సహాయం అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు లాలూచీ రాజకీయాలతో రాష్ట్రం నష్టపోతోందని అన్నారు. 

వ్యక్తిగత ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. వాస్తవాలు మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు లేదని న్నారు. పోరాటమని చెప్ిప ఢిల్లీలో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు లాలూచీ విన్యాసాలు దేశమంతా చూసిందని అన్నారు.