ఆ వ్యాఖ్యలను భువనేశ్వరీ సమర్ధిస్తారా?: బాబుపై రోజా ఫైర్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై పట్టాభి చేత చంద్రబాబు చేయించిన అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్‌లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ఆమె ప్రశ్నించారు.
తిరుపతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే Roja తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.Ys jagan పై Tdp వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే Ycpఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష చేపట్టారు.
also read:జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఈ దీక్షలో రోజా టీడీపీ చీఫ్ Chandrababu, ఆ పార్టీ నేత Lokesh పై మండిపడ్డారు.సీఎం జగన్‌పై పట్టాభి చేత చంద్రబాబు చేయించిన అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్‌లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను భువనేశ్వరి సమర్ధిస్తారా అని ఆమె అడిగారు.ఈ విషయమై చంద్రబాబును భువనేశ్వరి నిలదీయాలని లేకపోతే ఆమె ఎన్టీఆర్ కూతురే కాదన్నారు.ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని ఆమె మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు.
టీడీపీ కార్యాలయంలో నాలుగు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు అమిత్ షా వచ్చిన సమయంలో ఆయనపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు.