Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. విజయవాడలోని మూడో అడిషనల్ మెట్రోపాలిటిన్ కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. 
 

police produce tdp leader kommareddy pattabhi in vijayawada court
Author
Vijayawada, First Published Oct 21, 2021, 3:46 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. విజయవాడలోని మూడో అడిషనల్ మెట్రోపాలిటిన్ కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. కొమ్మారెడ్డి పట్టాభిరాం ను బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) అతడిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో pattabhi ని పోలీస్ వాహనాలను టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక వాహనంలో పట్టాభి తరలిస్తున్నట్లు తెలుసుకున్న TDP శ్రేణులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. తమకు పట్టాభిని చూపించాలంటు పోలీస్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని కాస్సేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలావుంటే టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా అమరావతికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ఎమ్మెల్యేగా సెక్రటేరియట్ కు వెళుతున్నానని...ఎందుకు అడ్డుకుంటున్నారని గోరంట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల సమస్య వుంది కాబట్టి పంపించడం లేదంటూ ఏలూరు వద్ద gorantla butchaiah ను పోలీసులు అడ్డుకున్నారు.

Also Read:పట్టాభిని హాస్పిటల్ కు తరలిస్తుండగా ఉద్రిక్తత... అడ్డుకున్న టిడిపి శ్రేణులు... ఈడ్చుకెళ్లిన పోలీస్ బలగాలు

బుధవారం రాత్రి kommareddy pattabhi ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను భారీ బందోబస్త్ మధ్య పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకువచ్చి అరెస్ట్ చేసారని ఆమె ఆరోపించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి భార్య కూడా ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని ఆమె హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని... ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె తెలిపారు. మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios