జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారని రోజా ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఉనికే లేదని రోజా తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం తమదేనని రోజా ధీమా వ్యక్తం చేశారు. జనసేనను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు రోజా.