మహిళలు జై జగన్ అంటే నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి... ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ జగన్ మహిళలు అడగకుండానే ఎంతో చేస్తున్నారని.. మహిళలందరూ జగన్ కు జై కొడుతున్నారని అన్నారు. ఇది చూసి చంద్రబాబు గుండెల్లో రీసౌండ్ రావాలని అన్నారు. 

ycp mla roja comments on womens day celebrations

అమరావతి : మహిళలు జై jagan అంటే నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలి అంటూ నగరి MLA Roja పేర్కొన్నారు. Inernational Women's Day సందర్భంగా ఆమె ఉద్విగ్నంగా మాట్లాడారు. ఈ‌ రాష్ట్రంలో మహిళ నేడు ఆత్మాభిమానంతో జీవిస్తోందన్నారు. సీఎం‌ జగన్ నేడు మహిళా సాధికారతకు అవకాశం కల్పించారన్నారు. తన 20 సంవత్సరాల‌ రాజకీయ జీవితంలో ఈ రోజు ఆనందంగా మాట్లాడుతున్నానన్నారు. ఇంకా రోజా మాట్లాడుతూ.. ‘‘ఎందరో నాయకులు వచ్చి వెళ్ళారు. వారెవరికీ సాధ్యం కాని సాధికారత సీఎం జగన్ చేసి చూపించారు. 

మహిళలు గతంలో పోలీసుల దెబ్బలు తినేవారు. కానీ, జగన్ ఏ మహిళా‌ సంఘం పోరాడకుండా మహిళలకు పట్టం కట్టారు. సీఎం జగన్ మహిళా సంక్షేమ మహా చక్రవర్తి సీఎం జగన్. చంద్రబాబు టీంకి జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా? నారావారి నరకాసుర పాలన మహిళలందరూ గమనించారు. లోకేష్ ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో మహిళలతో డాన్స్ లేశారు. లోకేష్ పీఏ మహిళలను వేధింపులకు గురి చేశారు. దేవినేని ఉమ తన పదవి కోసం వదినని చంపారు. బోండా ఉమ తల్లిని కొట్టాడు. 

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహిళను బూటు కాలితో తన్నాడు. 160 సీట్లతో టీడీపీ గెలుస్తుందని అచ్చన్న జోకేశాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ శ్రీవాణి అన్నారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్‌ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ జరిగింది. ఈ సభాస్థలికి ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, తానేటి వనిత, పాముల పుష్పశ్రీవాణి, నగరి ఎమ్మెల్యే రోజా, మేయర్ భాగ్యలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పదివేలకు పైగా మహిళలు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios