జగన్‌పై దాడి కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిందని, త్వరలోనే ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చేసిన తప్పును మళ్లీ చేయకూడదని ప్రజలు భావిస్తున్నారన్నారు.

ఐదుసార్లు ఓడిపోయి మంత్రిపదవిలో ఉన్నందుకు సోమిరెడ్డి సిగ్గుపడాలని రోజా దుయ్యబట్టారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నందుకు టీడీపీ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి చేయించి.. తప్పించుకోవడానికి టీడీపీ ప్రయత్నించిందని రోజా ఆరోపించారు. ఎన్ఐఏ నిజానిజాలు వెలుగులోకి తెచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు.