జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత హెచ్.ఏ రెహమాన్ విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి మతిస్థిమితం సరిగా లేదని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లో నటించినట్లు రాజకీయాల్లో నటిస్తే కుదరదని హెచ్చరించారు. వైఎస్‌ పాలన గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.

.నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, అన్యాయాలనుయ పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.  ఐదేళ్లకోసారి పార్టీలు మారుస్తూ కాపురం చేసే చంద్రబాబు, ఆర్నెల్లకోసారి పెళ్లాలను మార్చే పవన్‌ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఏపీలోని దోచుకున్న అవినీతి సోమ్ము ని చంద్రబాబు  తెలంగాణలో ఖర్చు పెడుతున్నారని, విచ్చలవిడిగా టీడీపీ నాయకుల ఇళ్లలో నగదు దొరుకుతోందని తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను మరచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.